నెతన్యాహూ ప్రధాని అయిన వేళ.. ఇజ్రాయెల్​పై రాకెట్ దాడులు

-

ఇజ్రాయెల్​ ప్రధానిగా బెంజిమన్‌ నెతన్యాహూ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమైన వెంటనే ఆ దేశంపై రాకెట్‌ దాడులు మొదలయ్యాయి. గురువారం రోజున ఈ దాడులు జరిగినట్లు సమాచారం. గాజా పట్టీ నుంచి నాలుగు రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించారు. వీటిల్లో ఒక్కదానిని ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ అడ్డుకుంది. ఈ దాడులను తామే చేసినట్లు ఇస్లామిక్‌ జిహాద్‌ సంస్థ ప్రకటించింది. అల్‌-బద్ర్‌ గ్రూప్‌ కమాండర్‌ను ఇజ్రాయెల్‌ దళాలు మట్టుబెట్టాయి. దీనికి ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు పేర్కొంది.

ఈ దాడికి ఇజ్రాయెల్‌ కూడా స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ దళాలు గాజా పట్టీలోని ఓ రాకెట్‌ ఫ్యాక్టరీపై దాడి చేశాయి. ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధ విమానాలు హమాస్‌ గ్రూప్‌ నిర్వహిస్తున్న అండర్‌గ్రౌండ్‌ రాకెట్‌ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. మధ్య గాజాలోని అల్‌ మఘాజీ శరణార్థి శిబిరం సమీపంలో ఈ దాడి జరిగింది. ఏప్రిల్‌ నుంచి ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసిన మూడో ఆయుధ ఫ్యాక్టరీ ఇది. ఈ దాడిలో ఎంత ప్రాణనష్టం జరిగిందో సమాచారం తెలియలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version