నా తండ్రి వల్లే చనిపోవాలనుకున్నా..డాన్సర్ ఝాన్సీ..!

-

ఇటీవల డాన్సర్ గా బాగా ఫేమస్ పొందిన గాజువాక కండక్టర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా టాలీవుడ్ సీనియర్ యాంకర్ ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో డాన్స్ ఐకాన్.. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమవుతున్న ఈ షో ఇప్పటికే 7 వారాలు అనగా 14 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. ఇకపోతే ఎనిమిదవ వారం సందర్భంగా 16వ ఎపిసోడ్స్ ప్రస్తుతం స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ షోలో నటి రమ్యకృష్ణ , కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఎపిసోడ్ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు షో అంతా ఎనర్జిటిక్ గా అదిరిపోయే పర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంది. కంటెస్టెంట్లు కూడా ఒకరిని మించి మరొకరు తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో ఇరగదీసారు. ఇక ఈ షోలో యాంకర్ శ్రీముఖి, కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్, మోనాల్ గజ్జర్ లు టీం లీడర్లుగా వ్యవహరించారు. ఇందులో శ్రీముఖి టీం నుండి ఆసిఫ్ పెర్ఫార్మెన్స్ చేయగా.. ఆసిఫ్ తో పాటు గాజువాక కండక్టర్ ఝాన్సీ కూడా పెర్ఫార్మన్స్ ఇరగదీసింది. పెర్ఫార్మెన్స్ తర్వాత చివర్లో ఎమోషనల్ అయింది.

ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి కారణంగా తాను ఎన్నో సార్లు చనిపోవాలి అనుకున్నానని , స్టేజ్ పై చెప్తే ఎమోషనల్ అయ్యింది. తన తల్లి కోసం , తమ్ముడి కోసం డాన్స్ తో పాటు ఉద్యోగం కూడా సంపాదించుకొని పైకి వచ్చినట్లు చెబుతూ కంటతడి పెట్టుకుంది ఝాన్సీ.. ఝాన్సీ బాధని చూసి అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version