నిన్న లక్నోపై ఓడిపోయి పాయింట్లు పట్టికలో అట్టడుగునా నిలిచి ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ముగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చివరి మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రోహిత్ శర్మ 38 బంతుల్లో 68 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
ఆయన అవుట్ అయి పెవిలియన్ కు వెళ్తుండగా అభిమానులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ముంబై కా రాజా రోహిత్ శర్మ అంటూ హిట్ మాన్ ను చప్పట్లతో అభినందించారు ముంబై ఫ్యాన్స్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా వాంకాడే స్టేడియంలో నిన్న లక్నో వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై దారుణంగా ఓడిపోయింది. లక్నో చేతిలో దారుణంగా ఓడిపోయిన ముంబై… మరో ఓటమిని మూటగట్టుకుంది.