రోహిత్‌ బ్యాటింగ్ పై ట్రోల్స్.. ఘాటు రిప్లై ఇచ్చిన హిట్ మ్యాన్

-

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మపై ఓ రేంజ్ లో ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ అవుట్ అయిన తీరును అందరూ విమర్శిస్తున్నారు. సులభమైన క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ అవుట్ కావడం.. క్రికెట్‌ ఫ్యాన్స్ ను, క్రీడా విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది. అయితే దీనిపై రోహిత్ కాస్త ఘాటుగానే స్పందించారు..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ అవుట్ అయిన తీరు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నతరుణంలో హిట్‌మ్యాన్‌ 44 పరుగుల వద్ద ఔటయ్యారు. లయన్‌ వేసిన ఫ్లైట్‌ బాల్ ను మిడ్‌-ఆన్‌లో భారీషాట్‌కు ప్రయత్నించారు రోహిత్‌. లాంగాన్‌లో ఉన్న స్టార్క్‌ కాస్త ముందుకు కదిలి బాల్ ను పట్టుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో రోహిత్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అనవసర దూకుడుతో రోహిత్‌ అవుట్ అయ్యాడంటూ విమర్శలు వస్తున్నాయి.

సులభమైన క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ ఔటైన తీరును క్రికెట్‌ అభిమానులతో పాటు, క్రీడా విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రోహిత్‌ షాట్‌ సెలక్షన్‌ అస్సలు బాగోలేదంటూ టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. లాంగాన్‌లో, స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డర్లు ఉన్నప్పుడు అలాంటి షాట్‌ ఆడాలని ఎలా అనుకున్నావ్‌ అంటూ హిట్ మ్యాన్ తీరును తప్పుబట్టారు గావస్కర్. రోహిత్ ఆట తీరును సంజయ్‌మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా కూడా తప్పుబట్టారు. అది బాధ్యతారాహిత్యమైన షాట్‌ అని విశ్లేషించారు.

తనపై వస్తున్న విమర్శలకు రోహిత్ బదులిచ్చారు. ఆ షాట్‌ ఆడినందుకు పశ్చాత్తాపం లేదని అన్నారు. ఇదే టెక్నిక్‌తో గతంలో ఎన్నో సార్లు విజయవంతమయ్యాను అని చెప్పుకొచ్చారు… కొన్నిసార్లు బంతి బౌండరీ అవతల పడవచ్చు… మరికొన్ని సార్లు ఔట్ అవ్వొచ్చు అని అన్నారు రోహిత్. జట్టు తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్లుగా ఆడటం తన బాధ్యత అని అన్నారు. ఇక విమర్శల గురించి అస్సలు ఆలోచించచని చెప్పారు రోహిత్. బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు తాను అలాంటి షాట్‌లు ఆడతానని, ఇకపై కూడా కొనసాగిస్తానని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version