షర్మిలపై రోజా సంచలన వ్యాఖ్యలు..ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ లో చేరావు !

-

షర్మిలపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ లో చేరావు అంటూ నిలదీశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒక సారి గమనించాలి….Ys జగన్ మోహన్ రెడ్డి ని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కల్పి అన్యాయం చేశారని ఆగ్రహించారు. షర్మిల గారికి సలహా ఇస్తున్నాను…ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుంచి ఏపీకి రావాల్సిన 6 వేల కోట్లు, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఎపికి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు రాబాట్టాలని డిమాండ్‌ చేశారు.

Roja’s sensational comments on Sharmila

టూర్ లు పెట్టి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేసిందో షర్మిల చెప్పాలని చురకలు అంటించారు. ఏపీలో ఏ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్నారో షర్మిల చెప్పాలని నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసే వాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ లో మళ్ళీ జాయిన్ అయ్యారో చెప్పాలన్నారు రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version