సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న సిరాజ్ ఓరీ ఫోటో..!

-

ఇటీవలి రోజుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలతో ఒక వ్యక్తి బాగా కనబడుతున్నాడు. స్టార్ హీరో హీరోయిన్ లని పట్టుకుని అతను ఫోజులు ఇస్తున్నాడు. అతనితో ఫోటోలు దిగడానికి బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అతను ఎవరో కాదు ఓరి. ఇంస్టాగ్రామ్ లో ఓరి కి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా సంచలనం ఓరి షేర్ చేసిన ఫొటోస్ క్షణంలో వైరల్ గా మారుతున్నాయి. భారీగా కామెంట్లు కూడా వస్తున్నాయి.

తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఓరితో ఫోటోలు దిగాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం వేదికగా రెండవ టెస్ట్ ఫిబ్రవరి 5న జరిగింది 15 నుండి రాజ్కోట్ లో మూడవ టెస్ట్ జరగబోతోంది. మూడవ టెస్ట్ కి పది రోజుల్లో ఉండడంతో భారత ఆటగాళ్లు సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. మొహమ్మద్ సిరాజ ముంబైలో కనపడ్డాడు. బుధవారం రాత్రి ముంబైలోని ఒక ఈవెంట్ కి వెళ్ళాడు అక్కడ ఓరిని కలిశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version