కొత్త జెర్సీని రివీల్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

-

ఐపీఎల్ వస్తోందంటే చాలు ఇక క్రికెట్ అభిమానులకి పండగే. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024 కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీని రివీల్ చేసింది. అన్ బాక్స్ ఈవెంట్లో భాగంగా కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు ఇతర ప్లేయర్స్ కొత్త జెర్సీలో కనిపించారు. అలాగే కొత్త లోగోను విడుదల చేశారు. పాత పేరు Royal Challengers BANGALORE Royal స్థానంలో మార్పులు చేసి Challengers BENGALURUగా మార్చారు.ఇక మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. ఈక్రమంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆటగళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version