ఐపీఎల్ లో బెంగళూరు నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీపై నిన్న జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 16 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేసిందిద. దీంతో బెంగళూరు విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ 66 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలువగా.. పంత్ 34 పరుగులు చేశాడు.
ఆర్సీబీ బౌలర్లలో హాజిల్ వుడ్ 3, సిరాజ్ 2, హసరంగా ఒక వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.
ఢిల్లీ ముందు 190 పరుగలు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు జట్టులో దినేష్ కార్తీక్ 66 పరుగులతో మరోసారి సత్తా చాటాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడిన దీనేష్ కార్తీక్.. రహ్మాన్ బౌలింగ్ 28 పరుగులు రాబట్టాడు. అలాగే.. మ్యాక్స్ వెల్ 55 పరుగులు, షాబాద్ అహ్మద్ 32 పరుగులు చేసి.. జట్టుకు మంచి స్కోర్ ను అందించారు.