జపాన్ లో స్టన్నింగ్ రికార్డ్ దిశగా దూసుకుపోతోన్న RRR.!

-

ఏ ముహర్తాన రాజమౌళి RRR స్టార్ట్ చేశాడో కాని ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలకు  లోటు లేదు. సర్ప్రైజ్ ప్యాక్ లాగా  రాజమౌళి ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది.

ఇప్పుడు నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు రేసులో షార్ట్ లిస్ట్ కు ఎంపిక అయ్యింది. ప్రపంచంలో ప్రతిష్టాతకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో RRR అవార్డు తెస్తుందని భావిస్తున్నారు. దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా సంగీత దర్శకుడు కీరవాణి కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను ప్రకటించింది. అలాగే 2022 ఫ్యాన్స్ ఫేవరెట్ చిత్రంగా గోల్డెన్ టొమాటో అవార్డు ను ఆర్ఆర్ఆర్ సినిమా సొంతం చేసుకున్నట్లుగా ప్రకటన విడుదల అయ్యింది.

ఇక ఇప్పుడు RRR జపాన్ రికార్డ్స్ వంతు వచ్చింది. ఇప్పటికే వసూళ్ల లో జపాన్ లో ఆల్ టైమ్ హిట్ అయిన RRR  సినిమా అక్కడ 100 రోజుల రికార్డ్ కూడా నెలకొల్పింది. ఇప్పటి వరకు జపాన్ లో 800 మిలియన్ ల యెన్లను ఆర్ఆర్ఆర్ వసూళ్లు చేసింది. ఏ ఇండియన్ సినిమా కూడా జపాన్ లో ఈ స్థాయి లో వసూళ్లు నమోదు చేయలేదు ఇప్పుడు RRR  బిలియన్ యెన్ లను దక్కించుకుని అరుదైన మైలురాయి టచ్ చేసే సత్తా ఉందని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version