కళాకారుడి ప్రతిభ.. ముక్కుతో చరణ్, తారక్, రాజమౌళిల పెయింటింగ్..

-

జనరల్‌గా రాజమౌళి దర్వకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నిటిలోనూ ఎమోషన్ ప్రధానంగా కనబడుతుంది. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు దాదాపు మూడేళ్ల పాటు తెరకెక్కించిన కళాఖండం ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్.. ఇది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం కనబడుతోంది. తమ అభిమాన కథా నాయకులను ఇన్నేళ్ల తర్వాత వెండితెరపైన అత్యద్భుతమైన పాత్రల్లో చూడబోతున్నామని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే హీరోల కటౌట్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి తమ వీర విధేయత, అభిమానాన్ని చాటుకుంటున్నారు ఫ్యాన్స్.

ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లపై ఉన్న ప్రేమను ఓ కళాకారుడు వినూత్నంగా చాటుకున్నాడు. అద్భుతమైన కళా ఖండాన్ని రూపొందించిన రాజమౌళి అంటే తనకు ఇష్టమని ఆ కళకారుడు తెలిపారు. నిజాంపేటకు చెందిన ఆర్టిస్ట్ సత్యవోలు రాంబాబు.. ముక్కుతో రాజమౌళి, చరణ్, తారక్‌ల పెయింటింగ్ వేసి అబ్బురపరిచాడు. ముక్కుకు రంగులు అద్దుకుంటూ దర్శకుడు, హీరోల బొమ్మలు గీసి అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఈ పెయింటింగ్స్ చూసి మెగా, నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఇలా ఇంకొన్ని రోజుల పాటు కొనసాగుతుందని, చిత్రం ఇప్పటి వరకు రికార్డులన్నిటినీ తిరగ రాయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సెలబ్రిటీలు ఇప్పటికే ఈ పిక్చర్ బెన్ ఫిట్ షో చూసేశారు. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో సినిమా చూసి ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తన భార్య కుటుంబ సభ్యులతో నగరంలోని ఓ థియేటర్‌లో సినిమా చూసేశాడు. రామ్ చరణ్ తేజ్ కూడా తన భార్యతో కలిసి చిత్రం చూశాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version