RRR: అభిమానులకు శుభవార్త..” కొమరం భీముడో” ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు.

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ ఇండియా సినిమా. “రౌద్రం రణం రుధిరం.” చిత్రం నుండి ఇప్పుడు మేకర్స్ ఒక్కో పాటని అలాగే సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని కొన్ని రోజుల గ్యాప్ లలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి ఒక అపురూపమైన మ్యూజిక్ ఆల్బమ్ చేస్తే దానిలో మాత్రం సినిమా చూశాక మరియు ఆదరణ వచ్చిన పాట ఒకటి ఉంది.

ఆ పాటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ఎమోషనల్ సాంగ్ ” కొమరం భీముడో” సినిమా రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ సాంగ్ ని సూపర్ హిట్ చేశాడు. అందుకే ఈ వీడియో సాంగ్ కోసం ఎప్పుడు నుంచో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ని ఈ రోజు (మే 6)న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఫైనల్ డేట్ ని అందించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పిన ఈ అనౌన్స్మెంట్ అయితే చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version