ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో జరుగుతున్నది. ఈ నెలాఖరు వరకూ జరిగే షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ ముగుస్తుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 13 వ తేదీన సినిమా విడుదల చేయనున్నారు. దోస్తీ ప్రమోషన్ సాంగ్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న సినిమా కావడంతో రాజమౌళీ ఈ చిత్రాన్ని ఎలా చిత్రీకరించాడు అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది.
మామాలుగా సినిమా పూర్తి చేసిన తరువాత సీజీ వర్క్స్ కోసం రాజమౌళీ కనీసం ఆరు నెలల సమయం తీసుకుంటారు. కానీ, ఈ సినిమా విషయంలో కరోనా కాలంలో షూటింగ్‌లేని సమయంలో సీజీ వర్క్స్ చేస్తూనే, షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఆగస్టు నెలఖరు నుంచి ఆర్ఆర్ఆర్ సందడి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. దోస్తీ సాంగ్‌తోనే ప్రమోషన్ షురూ చేసినా, ఫైనల్ షెడ్యూల్ కారణంగా మరో ప్రమోషనల్ వీడియో లేదా పోస్టర్ రిలీజ్ కావడానికి కొంత సమయం పడుతుంది. షూటింగ్ కంప్లీట్ చేసిన తరువాత, సినిమా రిలీజ్ కావడానికి మధ్య 45 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఆ 45 రోజులే ఆర్ఆర్ఆర్ సినిమాకు చాలా కీలకం. ఆ నెలన్నర కాలంలోనే సినిమా రిలీజ్ కాబోతున్న 5 భాషల్లోనూ ప్రమోషన్స్ చేసుకోవాలి. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా ప్రమోషన్ చేయాలి. సో, ఆ 45 రోజులు ఆర్ఆర్ఆర్ రోజులుగా చెప్పుకోవచ్చు.