షాకింగ్: “RRR” రికార్డ్ ను బ్రేక్ చేసిన హైజాక్ థ్రిల్లింగ్ డ్రామా !

-

టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల్లో అవార్డు సాధించిన విషయం తెలిసిందే. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ కొల్లగొట్టిన రికార్డ్ ను ఒక హిందీ లాంగ్వేజ్ మూవీ క్రాస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటిటి లో విడుదలైన తర్వాత రెండే వారాలలో ఎక్కువ మంది వీక్షించిన సినిమాగా రికార్డ్ సాధించింది. అలా ఆర్ ఆర్ ఆర్ ఇప్పటి వరకు 25 మిలియన్స్ హౌర్స్ వీక్షించిన రికార్డు ఉంది.

కానీ ఇప్పుడు ఆ రికార్డ్ కాస్త హిందీ సినిమా ఖాతాలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సన్నీ కౌశల్, యామి గౌతమ్ లు ప్రధాన పాత్రలు పోషించిన “చోర్ నికలే కా బాగా” మూవీ హైజాక్ థ్రిల్లర్ డ్రామా గా వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతానికి ఈమూవీ 29 మిలియన్స్ హౌర్స్ వీక్షించడంతో ఆర్ ఆర్ ఆర్ పేరిట ఉన్న రికార్డ్ కాస్త ఈ సినిమాకు వెళ్ళిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version