మూసీ సుందరీకరణకే రూ.1.50లక్షల కోట్లా.. కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు

-

పుట్టిన గడ్డపై మమకారం లేని సీఎం రేవంత్‌రెడ్డికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా.. మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ అని కేటీఆర్ ప్రశ్నించారు.

మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు.. మొన్న రూ.50వేలకోట్లు ఖర్చు అవుతుందన్నారని.. నిన్న.. రూ.70వేలకోట్లు వెచ్చిస్తామన్నారని.. నేడు.. రూ.1.50లక్షలకోట్లు వెచ్చిస్తామంటున్నారని అన్నారు.తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టిన కాంగ్రెస్.. మరి సుందరీకరణకే రూ.1.50లక్షల కోట్లు ఖర్చు చేస్తుందా? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో.. మురిసే రైతులెందురు.. నిల్వ ఉంచే టీఎంసీలెన్ని.. సాగులోకి వచ్చే ఎకరాలెన్ని.. పెరిగే పంటల దిగుబడి ఎంత.. తీర్చే పారిశ్రామిక అవసరాలెంత.. కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని.. అంటూ కేటీఆర్ నిలదీశారు.లండన్‌లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటీ? సీఎం గారూ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version