కిన్నెర వాయిద్య కారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత దర్శనం మొగిలయ్యకు రూ.కోటి నగదు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బీఎస్ రెడ్డి నగర్‌లో మొగిలయ్యకు ఇంటి స్థలం కేటాయించాలని పేర్కొంది. హైదరాబాద్‌లో 300 గజాల స్థలం, రూ.కోటి నగదు ఇవ్వాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఆయనకు నగదు, ఇంటి స్థలం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, తెలంగాణలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న ఏకైక కళాకారుడు దర్శనం మొగిలయ్య. గతంలో గ్రామాల్లో అక్కడక్కడా కిన్నెర వాయిస్తూ.. కడుపు నింపుకునే వాడు. కానీ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడటంతో ఒక్కసారిగా సెన్సేషనన్ అయ్యాడు. ఓవర్‌నైట్‌లో కిన్నెర మొగిలయ్యకు క్రేజ్ పెరిగిపోయింది. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. కోటి నగదు, 300 గజాల స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.