ఏడుపాయలకు రూ.100 కోట్లు విడుదల : హరీష్‌ రావు

-

మెదక్ జిల్లా: ఏడుపాయల దుర్గామాత కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించారు జిల్లా మంత్రి హరిశ్ రావ్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి,జడ్పి చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్. మంత్రి హరిశ్ రావ్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ పూజారులు. ఏడుపాయల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయల కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని.. మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ సందర్బంగా టూరిజం కోసం రూ 1500 కేటాయించారని చెప్పారు. ఏడుపాయల కు 100 కోట్ల రూపాయలు కేటాయించారని వెల్లడించారు. రూ.100 కోట్ల తో ఫౌంటెన్స్ ,క్వార్ట్జ్ లు ,ఇతర అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సింగూర్ కు లింక్ చేయడం వల్ల ఎదుపాయల్లో నీళ్లు ఎప్పుడు ఉంటాయని.. ఏడుపాయల్లో గతంలో ఇళ్ళ కోసంఅనేక ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కృషితో సింగూర్ కు నీళ్లు వస్తున్నాయి..గతంలో నీళ్ల కొరత ఉండేదని… కాళేశ్వరం ప్రారంభించిన్నప్పుడు పనులు కానేకావని హేళన చేశారని ఫైర్‌ అయ్యారు. మల్లన్నసాగర్ అంటే జల ప్రవాహినని.. మల్లన్నసాగర్ నీళ్ల తో మెదక్ జిల్లా ను సస్యశ్యామలం చేస్తామని ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version