జగన్‌ సర్కార్‌ కు కేంద్రం మరో శుభవార్త… ఏపీకి రూ. 1438 కోట్లు విడుదల

-

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. 17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కి కేంద్రం నిధులు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే దేశం లోని 17 రాష్ట్ర ప్రభుత్వాలకు ఏకంగా రూ. 9871 కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. ఇక ఈ 17 రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కూడా ఉండటం విశేషం. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఏకంగా 1438 కోట్ల రూపాయల ను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.

2021 – 22 ఆర్థిక సంవత్సానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి మొత్తంగా రూ. 8628 . 50 కోట్లు విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. ఇక కేంద్ర విడుదల చేసిన ఆర్థిక సహాయం పై ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ కూడా స్పందించారు. 2021- 22 ఆర్ధిక సంవత్సరానికి 15 వ ఆర్థిక సంఘం మొదటి విడతగా రూ.581.70 కోట్లను కేంద్రం విడుదల చేసిందన్నారు. ఈ నిధుల్లో 70% అంటే రూ. 407.19 కోట్లు గ్రామ పంచాయతీలకు, 15% అంటే రూ.174.51 కోట్లు జిల్లా పరిషత్ లకు 15% అంటే రూ.174.51 కోట్లు మండల పరిషత్ లకు జమ అయినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version