రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం మీ సేవా కేంద్రాలు సామాన్య ప్రజల నుంచి అందినకాడికి దోచేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ప్రజలు రేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. అయితే, రేషన్‌కార్డుల దరఖాస్తు కోసం రూ.50కు బదులు దాదాపు రూ.2 వేలు వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల దగ్గర నిర్వాహకులు దోచేస్తున్నట్లు టాక్.కాగా, కోఠి ప్రభుత్వ మీసేవ కేంద్రం వద్ద ఉదయం 6 గంటల నుండి జనాలు క్యూ లైన్లో నిల్చున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.మీ సేవా కేంద్రంలో సిబ్బంది తక్కువగా ఉండడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు తెలిసింది.