మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.30లక్షలు ఇచ్చా : దర్శన్

-

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్  అభిమాని హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకొంది. అభిమాని హత్య అనంతరం మృతదేహాన్ని ఎవరి కంట పడకుండా మాయం చేసేందుకు దర్శన్ మరో నిందితుడికి రూ.30 లక్షలు ముట్టజెప్పినట్లు తేలింది. ఈ నేరాన్ని దర్శన్ స్వయంగా అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

అభిమాని హత్య కేసులో దర్శన న్ను అరెస్టు చేసిన పోలీసులు.. కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. రేణుకాస్వామి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని మరో నిందితుడైన ప్రదేశ్కు రూ.30లక్షలు ఇచ్చినట్లు దర్శన్ అంగీకరించాడు. ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తన పేరు బయటకు రాకుండా చూడాలని కోరినట్లు తెలిపాడట. దర్శన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అభిమాన నటుడు దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్రా గౌడ చిచ్చు పెడుతోందంటూ ఆయన అభిమాని రేణుకాస్వామి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడు హత్యకు గురి కావడం సంచలనం రేపింది. ఈ కేసులో దర్శన్ సహా 17 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version