రూ. 8వేలు అప్పు తీర్చలేక ముగ్గురు పిల్లలకు విషమిచ్చిన తల్లి..

-

అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనం చాలా చుశాం. లక్షల లక్షల అప్పు తీర్చలేక చనిపోయే వాళ్లు ఉంటారు..కానీ 8వేల రూపాయల అప్పు చెల్లించలేక తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

పిల్లల పరిస్థితి విషమం..

బిహార్‌లోని దర్భాంగ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 6, 8 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు, 2 ఏళ్ల వయసు ఉన్న ఓ కుమారుడికి ఓ మహిళ విషాన్ని ఇచ్చింది. ఆ తర్వాత తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంది.. ప్రస్తుతం దర్భాంగ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. ముందుగా బిరౌల్ కమ్యూనిటి హెల్త్ సెంటర్‌కు పిల్లలను తీసుకెళ్లగా.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం దర్భాంగ ఆసుపత్రికి తరలించినట్టు పోలీస్ అధికారి సల్వార్ ఆలమ్ చెప్పారు. ఆ మహిళ స్టేట్‍మెంట్‍ను రికార్డ్ చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్టు అక్కడి వైద్యులు అంటున్నారు..
రూ.8,000 అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేక ఈ ఘటనకు పాల్పడినట్టు ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు..రోజుకూలీ చేసే భర్త బయటికి వెళ్లిన సమయంలో ముందుగా ముగ్గురు పిల్లలకు విషమిచ్చిన ఆ మహిళ.. ఆ తర్వాత తానూ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని బిరౌల్ పోలీస్ స్టేషన్ చీఫ్ ఎన్‍ఎన్ సారంగ్ తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల నుంచి విచారణ జరుపుతామని వెల్లడించారు. బిడ్డలను కనే హక్కు మనకు ఉంది కానీ వారిని చంపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? పోషించలేక ఇలా చేయడం కరెక్టేనా..? ఇప్పుడా ఆ ముగ్గురి భవిష్యత్తు ఏంటి.. చూసేవాళ్లకు అవి ఎనిమిది వేలే అనిపించవచ్చు..కానీ చేతిలో చిల్లిగవ్వ లేనివాళ్లకు అంత డబ్బు వేలు అయినా లక్షల్లానే అనిపిస్తుంది.. దేశంలో పేదరికం ఈస్థాయిలో ఉందా.? ఏటు పోతుంది ఈ సమాజం.. ఇలాంటి ప్రశ్నలను నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా కమెంట్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version