యాదగిరిగుట్టలో హెలికాప్టర్‌కు వాహన పూజలు..ధర ఎంత అంటే ?

-

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం మొదటిసారి నూతన హెలికాప్టర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు ఆలయానికి తీసుకువచ్చి పూజలు చేస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రతిమ మెడికల్ కళాశాల ఎండి మరియు ప్రతిమ గ్రూప్స్ అధినేత బోయిన్ పల్లి శ్రీనివాస్ రావు నూతనంగా కొనుగోలు చేసిన హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు తీసుకువచ్చారు. హెలికాప్టర్ ను టెంపుల్ సిటీలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ చేశారు. ఇక ఈ పూజా కార్యక్రమంలో శ్రీనివాస్ రావు తో పాటు విద్యాసాగర్ రావు కూడా పాల్గొన్నారు. అయితే ఈ హెలికాప్టర్ ధర దాదాపు రూ. 46 కోట్లు ఉన్నట్లు సమాచారం అందుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version