రాష్ట్రంలోని గురుకులాల్లో వరసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటుండటంపై మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్ర ఉందని ఆరోపించారు.మగనూర్ గురుకుల పాఠశాలలో ఇన్ని సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడానికి అదే కారణమన్నారు.
గతంలో గురుకులాల బాధ్యతను ఆయనే చూశారని, అందులో చాలా వరకు ఆయనకు సంబంధించిన వారే హాస్టల్ వార్డెన్లుగా కొనసాగుతున్నారని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకే వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర అని విమర్శించారు.