సైబర్ సెక్యూరిటీ వింగ్ మీద ఆర్ఎస్పీ సీరియస్.. వారిపై ఎందుకు కేసు పెట్టలే?

-

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మీద బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ అయ్యారు.  తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియా అకౌంట్ల మీద ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల అకౌంట్లే కనిపిస్తున్నాయా?.. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మార్ఫింగ్ ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు.కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్ల నుండి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.మరి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఇవన్నీ కనిపించడం లేదా?’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news