సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రన్నింగ్‌లో ఉన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం.సిద్దిపేట-ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా మొత్తంగా ఐదుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
వెంటనే 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గర్భిణి మహిళను ప్రత్యేకంగా అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. గర్భిణికి తీవ్ర గాయాలు
సిద్దిపేట – ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్డు వద్ద కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు.
కారులో ఉన్న గర్భిణికి తీవ్ర గాయాలు.
108 ద్వారా క్షతగాత్రులను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. pic.twitter.com/hIWCV4N7OH
— Telugu Scribe (@TeluguScribe) December 16, 2024