అసెంబ్లీ సెషన్స్.. వాయిదా తీర్మానం కోరనున్న బీఆర్ఎస్

-

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సర్కారును ఇరుకున పెట్టేందుకు సిద్దమైంది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ తరుపున వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని లగచర్లలో ఫార్మా సిటీ పేరిట ప్రభుత్వ భూసేకరణను ప్రతిఘటించిన అమాయక గిరిజన రైతులపై ప్రభుత్వ నిర్భంధం, పోలీసుల థర్డ్ డిగ్రీ..నెల రోజులుగా రైతులను జైళ్లలో బంధించిన అంశంపై చర్చ జరపాలని పట్టుబట్టనుంది.

ఈ మేరకు బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.లగచర్ల ఘటనపై చర్చ జరపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కాలేరు వెంకటేష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, విజయుడు, మర్రి రాజశేఖర్ రెడ్డిలు వాయిదా తీర్మానం నోటీస్‌పై సంతకం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version