తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం..పండువేళ నిరాశలో ప్రయాణికులు

-

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం కొలిక్కిరావడం లేదు..దసరా, నవరాత్రుల ఉత్సవాలకు సోంత ఊళ్లకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులుకు నిరాశ మిగిలింది..రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య నడిపే అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సారి దసరా,దుర్గ ఉత్సవాలకు బస్సులు నడిపే అంశంలో క్లారిటీ రాలేదు.అధికారుల స్థాయిలో జరుపుతున్న చర్చలు వరుసగా విఫలమవుతున్నాయి..దసరా నవరాత్రులు ప్రారంభమైనా ఇప్పటికీ ఏపీ-తెలంగాణ మధ్య బస్సుల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ పడలేదు. దీంతో ప్రైవేటు బస్ యాజమాన్యాలు లాభాల పంట పండించుకుంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న ఆర్టీసీ వివాదానికి తెర పడటం లేదు..రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడపడంపై రాష్ట్ర ప్రభుత్వాల మధ్య క్లారిటీ రావడం లేదు. ఎవరెన్ని కిలో మీటర్లు తిప్పాలి..ఏయే రూట్లల్లో తిప్పాలనే అంశంపై దాదాపు రెండు నెలల నుంచి ఏపీ-టీఎస్ ఆర్టీసీ అధికారులు..రవాణ శాఖ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి..

పండగ సీజన్ కావడంతో హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రావాలనుకునే ప్రయాణికులను అందిన కాడికి దోచుకుంటున్నాయి. బస్సు ఛార్జీలు చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పండగ సీజన్ కావడంతో ఎంతయినా ఖర్చుపెట్టి సొంతూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితిలో గత్యంతరం లేక జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వీలయినంత తొందరగా ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version