కేసీఆర్ ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందాలి..!

-

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టిసి కార్మికులకు 21% ఫిట్ మెంట్ ప్రకటించిన సంఘటన తెలిసింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని 26 మంది ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు తీసింది అని ఉద్యోగులు ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిసిని ఆదుకునే ప్రయత్నం చేసిందని అన్నారు. మిగతా శాఖలు ఉద్యోగాలకు 30 నుండి 35% ఫిట్మెంట్ ప్రకటించిన ఆర్టీసీ కార్మికులకు 21% ఇచ్చారని ఆయన కూడా మాకు సంతోషంగా ఉందన్నారు ఆర్టీసీ కార్మికులు.

మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టిసికి ఆదాయం ఆక్యుపెన్సి పెరిగిందని మళ్లీ రికార్డ్ సృష్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కార్మికులు చెప్తున్నారు మరోవైపు కేసీఆర్ అధికారం కోల్పోయిన ఆర్టీసీ కార్మికుల్లో ఆయన పట్ల కోపం తగ్గలేదు. 26 మంది ప్రాణాలు తీశారని కనీసం పెళ్లిళ్లు ఫంక్షన్లు కూడా చేసుకోలేని పరిస్థితి తీసుకు వచ్చారని మండిపడ్డారు ఇప్పటికైనా పశ్చాతాపం చెంది ఆర్టీసీ కార్మికులకు చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకోవాలి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news