మేడారం జాత‌ర‌కు వెళ్లే భ‌క్తుల‌కు ఆర్టీసీ శుభ‌వార్త.. 3850 స్పెషల్ బస్సులు

-

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మేడారం జాతర కోసం ప్రత్యేకంగా 3850 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. జాతర జరిగే రోజులలో అన్ని జిల్లాల నుంచి మేడారం జాతరకు వచ్చే లా ఈ ముప్పై ఎనిమిది వందల యాభై బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి రవాణా సమస్యలు తలెత్త కూడదని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఈ బస్సులు ఆగేందుకు మేడారంలో 50 ఎకరాల్లో భారీ బస్టాండు ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ మేడారం జాతర లో పాల్గొనాలని భక్తులకు సూచించారు ఆర్టీసీ అధికారులు.

కాగా తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మహా జాతర మేడారం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర సాగుతుంది. 2022 సంవత్సరంలో భాగంగా.. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version