Breaking: ఆటోను ఢీకొన్న సజ్జనార్ కారు.. సజ్జనార్ కు స్వల్ప గాయాలు

-

Breaking : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కు ఘోర ప్రమాదం తప్పింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కారు ఆటోను ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి లో చోటు చేసుకుంది. పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్‌ రోడ్డు వద్ద రాత్రిపూట ఈ ఘటన జరిగింది.

దీంతో ఆటోల ప్రయాణిస్తున్న నలుగురు గాయపడగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కు స్పల్ప గాయాలు అయ్యాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌… మహారాష్ట్రకు వెళుతుండగా.. ధర్మారం క్రాస్‌ రోడ్‌ వద్ద ఆ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కుడి చేతి వేలుకు గాయమైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version