చాలా మంది బంగారంని ఎక్కువగా కొంటూ ఉంటారు. డబ్బులు ఉంటే చాలు బంగారంని కొంటూ ఉంటారు. ఏ సందర్భం వచ్చినా కూడా బంగారాన్ని కొనేస్తూ ఉంటారు. మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది నిజానికి డబ్బులు ఉన్నప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదే. అయితే ఇంట్లో బంగారం ని పెట్టేందుకు కొన్ని రూల్స్ కూడా వున్నాయి. బంగారం ఇంట్లో ఎంత ఉండాలి అనేది తెలుసుకోవాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టాక్సెస్ గతం లోనే బంగారానికి సంబంధించి ఒక సర్కులర్ తీసుకు వచ్చింది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు వద్ద ఎంత బంగారం ఉండాలని అందులో క్లియర్ గా చెప్పింది.
మీరు సంపాదించిన డబ్బుతో ఎంతైనా బంగారాన్ని కొనొచ్చు. దానికి ఎలాంటి లిమిట్ లేదు కానీ ప్రూఫ్ ఉండాలి. అందులో కొంత లిమిట్ దాకా ఆ రుజువులు సైతం చూపించాల్సిన పని లేదు కానీ సిబిడిటీ చెప్పిన పరిమితికి మించి ఇంట్లో బంగారం ఉంటే కనుక ఎప్పుడు ఎంత ఎక్కడ కొనుగోలు చేశారో అనే బిల్లును మీరు కచ్చితంగా చూపించాలి. ఇక ఇంట్లో ఎవరి వద్ద ఎంత బంగారం ఉండొచ్చు అనేది చూద్దాం.. పెళ్లి కానీ మహిళ దగ్గర 250 గ్రాములు అంటే 20 తులాల వరకు బంగారం ఉండొచ్చు.
పెళ్లి అయిన మహిళ దగ్గర 50 తులాల వరకు బంగారం ఉండొచ్చు.
ఎలాంటి రుజువులు లేకుండా దాన్ని ఉంచుకోవచ్చు. పురుషుడి దగ్గర అయితే 100 గ్రాములు బంగారం అంటే పది తులాల వరకు ఉండొచ్చు. ఒకవేళ కనుక ఈ పరిమితికి మించి బంగారం ఉంటే ప్రూఫ్ చూపించాలి లిమిట్ కి మించి బంగారం ఉంటే రుజువులు చూపించకపోతే ఆ బంగారాన్ని ఆదాయము పన్ను శాఖ సీజ్ చేస్తుంది. నిబంధనలు పాటిస్తే మాత్రం సీజ్ చేయరు. జప్తు చేసిన అభరణాలని కొనాలంటే ఆదాయం ఎలా వచ్చిందనేది చెప్పాలి లేకపోతే ఇన్కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 115బీబీఈలో సూచించిన రేటు ప్రకారం సెక్షన్ 69బీ కింద ట్యాక్స్ ని విధిస్తారు. నిర్ణీత రేటు 60 శాతం, అదనంగా ఫీ 25 శాతం, 4 శాతం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, 10 శాతం పెనాల్టీ ఇవి అన్నీ కూడా కట్టాల్సి వుంది.