భారత్ కు రక్షణ రంగంలో రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎస్ -400 వైమానిక రక్షణ వ్యవస్థలను పంపిణీని వేగవంతం చేయాలన్న భారతీయ అభ్యర్థనను తాము అర్ధం చేసుకున్నామని… వాటిని త్వరగా అందించడానికి రష్యా ప్రయత్నిస్తుందని, మొదటి బ్యాచ్ ను 2021 చివరి నాటికి అప్పగిస్తామని రష్యా దౌత్యవేత్త గురువారం ఒక ప్రకటనలో చెప్పారు.
ఎస్ -400 వైమానిక రక్షణ వ్యవస్థల కోసం 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందం షెడ్యూల్ ప్రకారం అమలు జరుగుతుంది అని రష్యా పేర్కొంది. భారత అవసరాలను తీర్చడానికి తాము సిద్దంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. చైనాతో వివాదాల తర్వాత భారత్ తన రక్షణ రంగ సామర్ధ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలోనే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తో పలు ఒప్పందాలను చేసుకుంటుంది.