ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఉక్రెయిన్ – రష్యాల మధ్య నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించనున్నారు. నేడు జరగనున్న ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి చర్చిస్తాయి. అంతకుముందు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా UN భద్రతా మండలిని అత్యవసర సమావేశం కోసం కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మేము శాంతిని కోరుకుంటున్నామని.. మా చర్యలలో మేము స్థిరంగా ఉన్నాము…మేము రాజకీయ మరియు దౌత్యపరమైన పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఉక్రెయిన్ ప్రతినిధి యూఎన్ సమావేశంలో అన్నారు. రష్యా తమ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ కోరుతోంది.
మరోవైపు ఉక్రెయిన్ తూర్పు భాగంలో ఘర్షణ వాతావరణ తలెత్తింది. ఏ క్షణంలో అయినా యుద్దం వచ్చేలా ఉంది పరిస్థితి. ఇప్పటికే ఉక్రెయిన్ బలగాలు, వేర్పాటువాదుల మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించిన పేరుతో రష్యా 5గురు ఉక్రెయిన్ సైనికులను కాల్చింది. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి.