ఐపీఎల్ 2022 మెగా వేలం… ఈ నెల 12, 13 తేదీల్లో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా వేలం సమయంలో… ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగ బడ్డాయి. ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించాయి. అయితే ఈ మెగా వేలంపై తాజాగా టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లను పశువులను కొన్నట్టు కొన్నారని ఉతప్ప పేర్కొన్నారు.
ఐపీఎల్ వేలం ప్రక్రియ ను చూస్తే సంతలో పశువులను కొనుగోలు చేస్తున్న భావన కలిగిందని… వస్తువుల కోసం పోటీ పడుతున్నట్లుగా ప్రాంఛైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయని పేర్కొన్నారు. వేలంలో ఆటగాన్ని ఏదైనా ప్లాన్ చేసి కొనుగోలు చేస్తే సరి.. ఎవరు కొనకపోతే అతడి పరిస్థితి ఎంత బాధాకరం ఎవరూ ఊహించలేరు అని ఆవేదన వ్యక్తం చేశాడు.
వేలం తీరుతెన్నులు చూస్తే క్రికెటర్లు కూడా మనుషులేనా అన్న విషయాన్ని ప్రాంఛైజీలు మర్చిపోయినట్టు అనిపిస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు రాబిన్ ఉతప్ప. కాగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ… రాబిన్ ఊతప్ప ను రెండు కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.