వెనక్కి తగ్గిన ఉక్రెయిన్… నాటోలో చేరాలనుకోవడం లేదంటూ వ్యాఖ్యలు చేసిన జెలన్ స్కీ

-

రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధానికి కారణం అయిన ప్రధాన అంశాలపై ఉక్రెయిన్ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజగా జెలన్ స్కీ చేస్తున్న ప్రకటనలు చూస్తే ఇది అర్థం అవుతోంది. జెలన్ స్కీ మాట్లాడుతూ… నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరదలుచుకోవడం లేదని సంచలన ప్రకటన చేశాడు. మాపై దాడులు చేస్తున్నా.. రష్యాపై నాటో పోరాడం లేదని ఆయన అన్నారు. ఉక్రెయిన్ భూభాగంలో రష్యా గుర్తించిన ప్రత్యేక ప్రాంతాలను దేశాలుగా గుర్తించేందుకు కూడా జెలన్ స్కీ గుర్తించేందుకు సిద్ధం అయ్యారు. యుద్ధాన్ని ఆపే శక్తి కేవలం అమెరికా అధ్యక్షుడ బైడెన్ కే ఉందని జెలన్ స్కీ అన్నారు. రష్యా దండయాత్ర ఉక్రెియిన్ తో ముగియదని… అది ప్రపంచంపై కూడా ప్రభావం చూపిస్తుందని అన్నారు. పుతిన్ ను ఓ మృగంగా పోల్చాడు. ఆయన ఎప్పటికీ సంత్రుప్తి చెందడని విమర్శించారు. తమపై రష్యా హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు దాడి చేస్తున్నాయని.. అందుకే ఉక్రెయిన్ పై నో ఫ్లైయింగ్ జోన్ విధించాలని మరోసారి జెలన్ స్కీ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version