క్యాస్టింగ్ కౌచ్.. సినీ రంగాన్ని పట్టిపీడిస్తున్న భూతం ఇది. గతంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ కు బలైన కొంత మంది ఇప్పుడు బయటకు రావటంతో రెండు సంవత్సరాలుగా ఈ అంశం బాగా వినిపిస్తుంది. అయితే.. తాజాగా మంచు లక్ష్మి క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎదుర్కొన్న బాడీ షేమింగ్, ట్రోల్స్, కాస్టింగ్ కౌచ్ వాటిపై నోరు విప్పింది.
తాను కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని.. తానున మోహన్ బాబు కూతురిని, సినిమా ప్రపంచలోనే పుట్టి పెరిగాను కదా? కాస్టింగ్ కౌచ్ ఎందుకు ఎదురువుతుందని అనుకున్నాను అంటూ మంచు లక్ష్మీ పేర్కొంది. కానీ ప్రతి పరిశ్రమ, ప్రతీ రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ ఉంటుందని ఆమె వెల్లడించింది.
బ్యాంకింగ్, ఐటీ ఇలా అన్ని చోట్లా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని మంచు లక్ష్మి బాంబ్ పేల్చింది. తన ఫ్రెండ్స్ ఎందరో వాటి గురించి చెబుతుంటారు. ఇక బాడీ షేమింగ్, ట్రోల్స్ అందరికీ ఎదురవుతుంటాయి. ఎలా ఉన్నా కూడా ట్రోల్ చేస్తుంటారు. వాటిని పట్టించుకోకూడదు. మనకు నచ్చినట్లుగానే ఉండాలని సూచనలు చేసింది మంచు లక్ష్మి.