వికీపీడియాకు రూ.20 లక్షల భారీ జరిమానా

-

తాజాగా వికీపీడియా పై రష్యా ప్రభుత్వ విరుచుకుపడింది. తనకు వ్యతిరేకంగా రాసిన వ్యాసాన్ని ఆన్ లైన్ లో ఉంచిందన్న కారణంతో రష్యా ప్రభుత్వం వికీపీడియాకు రూ.20 లక్షల భారీ జరిమానా వడ్డించింది. ఉక్రెయిన్ కు చెందిన జపోర్జియా ప్రాంతాన్ని రష్యా బలగాలు ఆక్రమించుకోవడం తెలిసిందే. దీనిపై వికీపీడియాలో రష్యా దురాక్రమ పేరుతో ఓ వ్యాసం ప్రత్యక్షమైంది. దీనిపై రష్యా ప్రభుత్వ సమాచార విభాగం కోర్టును ఆశ్రయించింది. ఆ వ్యాసాన్ని తొలగించేలా వికీపీడియాను ఆదేశించాలని కోర్టును కోరింది. అయితే, రష్యా ప్రభుత్వ డిమాండ్ సరికాదని వికీపీడియా వాదించింది.

కానీ, రష్యా కోర్టు అదేమీ పట్టించుకోకుండా వికీపీడియాకు జరిమానా విధించింది. వికీపీడియా మాత్రం తాము పూర్తిగా వాస్తవాలను ధ్రువీకరించుకున్న తర్వాతే వ్యాసాలు ప్రచురించామని, తొలగించేది లేదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలయ్యాక వికీపీడియా జరిమానాకు గురికావడం ఇదే ప్రథమం కాదు. మేరియుపోల్, బుచా ప్రాంతాల్లో రష్యా విధ్వంసం గురించి రాసినందుకు ఓసారి… సైకియా అనే రష్యన్ మ్యూజిక్ బ్యాండ్ పాటను తొలగించనందుకు మరోసారి వికీపీడియాపై జరిమానా విధించారు. ఏడాది దాటిపోయినా ఉక్రెయిన్ తనకు లొంగలేదన్న కసితో ఉన్న రష్యా తన ఆగ్రహాన్ని పలు రూపాల్లో ప్రదర్శిస్తోంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version