రైతుబంధు చెక్కుల పంపిణీ నిలిపివేత…నేరుగా ఖాతాలోకే

-

 

తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సర్వంసిద్ధం చేసుకుంటున్న క్రమంలో ఈసీ బ్రేక్ వేసింది. ఇప్పటికే ఈ పథకం కింద శుక్రవారం 10 జిల్లాల్లోని 22 గ్రామాల్లో చెక్కుల పంపిణీ ప్రారంభించారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో శనివారం నుంచి వాటి పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…. కేంద్ర ఎన్నికల సంఘం చెక్కల పంపిణీని అనుమతించినప్పటికీ కొన్ని షరతులు విధించింది… ‘‘సాధ్యమైనంత వరకూ ఎలక్ట్రానిక్‌ బదిలీ విధానంలో రైతు బ్యాంకు ఖాతాలోకి ఆన్‌లైన్‌లో నగదు పంపాలి, కొత్త లబ్ధిదారులెవరినీ జాబితాల్లో చేర్చవద్దు పాత జాబితాల ప్రకారమే నిధులు ఇవ్వాలి. పథకానికి సంబంధించి గ్రామాల్లో ప్రజలతో బహిరంగ సభలు నిర్వహించొద్దు, రైతుబంధు కార్యక్రమాల్లో రాజకీయ నేతలెవరూ పాలుపంచుకోరాదు, ఈ పథకంపై ఎలాంటి ప్రచారం చేయొద్దు ’’ అని పేర్కొంది.

ఈసీ ఆదేశాలతో అధికారులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి… రైతుల బ్యాంకు ఖాతా నెంబరు తీసుకుని వారి బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను అనుసంధానం చేయాలి. ఇప్పటికే 11 లక్షల చెక్కులను జిల్లా కేంద్రాలకు పంపినట్లు కమిషనర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 52లక్షల చెక్కులకు గాను 5300 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈసి విధించిన నిబంధనలతో తెలంగాణ రైతాంగానికి కాస్త నిరాశను కలిగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version