ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. నవరత్నాలు అమలులో భాగంగా వరసగా రెండో ఏడాది రైతులకు పెట్టుబడి సహాయం చేస్తోంది. ‘వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకం కింద రైతుల ఖాతాల్లో మూడో విడత నగదు జమచేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఈ రైతు భరోసా కింద 1,766 కోట్ల రూపాయలను నేడు రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది.
దీనికి తోడు నివర్ తుపాను తో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్బిడీ కింద కూడా కొన్ని నిధులను జమ చేస్తుంది. రైతు భరోసా కింద 1,120 కోట్లు, పెట్టుబడి రాయితీ కింద 646 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయ నుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఈరోజు సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు.