దేశంలో గ్రామాల డెవలప్మెంట్ కు కోసం సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో డెవలప్మెంట్ లో మంచి పనితీరును కనబరిచిన గ్రామపంచాయతీలకు ర్యాంకులు కేటాయిస్తోంది. అయితే తాజాగా సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో దేశంలోని టాప్ 10 గ్రామపంచాయతీల్లో 7 తెలంగాణకు చెందినవే ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి జీపీ దేశంలోనే తొలిస్థానం సాధించింది. నిజామాబాద్ జిల్లా కౌలస్ రెండో స్థానంలో నిలిచింది. కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం 4వస్థానంలో, నిజామాబాద్ జిల్లా కందకుర్తి 5వ స్థానంలో, కరీంనగర్ జిల్లా వీర్నపల్లి 6వ స్థానంలో, కరీంనగర్ జిల్లా రామక్రిష్ణాపూర్ 9వ స్థానంలో, నిజామాబాద్ జిల్లా ఠాణాకుర్ధ్ 10వ స్థానంలో ఉన్నాయి.
జీపీల్లో జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా అభివ్రుద్ది చెందేందుకు సంసద్ ఆదర్శ గ్రామయోజన లక్ష్యాలుగా ఉన్నాయి. జీపీలో మెరుగైన సదుపాయాలు కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.