జ‌గ‌న్ విష‌యంలో ఆ జోస్యం నిజ‌మ‌వుతుందా..!

-

మీడియాలో ఫోకస్ అవడానికి కొంద‌రు నేత‌లు లాజిక్ కి అందని స్టేట్ మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇక ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ ఇదే కోవ‌లోకి వ‌స్తారు. ఆయ‌న అంచ‌నాలు మొదట్లో హిట్ అయినా తరువాత త‌ల‌కిందుల‌య్యాయి.  తెలంగాణాలో కేసీఆర్ ఓడిపోతారు అంటే ఆ యన ఘ‌న విజ‌యం సాధించారు. ఇక ఏపీలో జగన్ ఓడిపోవడం ఖాయమంటే సూపర్ విక్టరీతో అ జేయుడిగా నిలిచారు. ఈ రెండు దెబ్బలకు ఇపుడు లగడపాటి జాత‌కాల‌కు స్వ‌స్తి చెప్పి, ఎక్క‌డా కనిపించడం మానేశారు.

అయితే ఆయన సన్నిహితుడు, రాజకీయ విశ్లేషకుడు అవతారం ఎత్తిన మాజీ ఎంపీ విశాఖ ఆక్టోపస్ స బ్బం హరి జ్యోతిష్యుడిగా మారి మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నా ఇపుడు మాత్రం జాతకాలు చెప్పేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ పై ఆయ‌న చేసిన కామెంట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.  ఏపీకి సీఎం గా జ‌గ‌న్ రెండేళ్లు మాత్రమే ఉంటారని సబ్బం హరి జోస్యం చెప్పేశారు. జగన్ సీఎం ఎందుకు అయ్యారా అని జనం బాధ పడుతున్నారని, రావాలి జగన్ అని ఓటేసిన వాళ్ళంత పోవాలి జగన్ అంటున్నార‌ని ఆయ‌న చిలుక‌ప‌లుకులు ప‌లుకుతున్నారు.

జ‌గ‌న్ మహా అయితే రెండేళ్ళు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటార‌ని జాత‌కం చెబుతున్నారు సబ్బం హ రి. రెండేళ్ళు ఓపిక పట్టండి, వైఎస్ జగన్ దిగిపోతారు. మన చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆ యన టీడీపీ క్యాడర్‌లో స్థైర్యం నూరిపోస్తున్నారు. అయితే ఇదంతా బాగనే ఉన్న‌ప్ప‌టికీ… ఎందుకు జగన్ రెండేళ్లు మాత్రమే పదవిలో ఉంటారు అన్న ప్ర‌శ్న‌కు సబ్బం హరి త‌న‌దైన లాజిక్‌ను చెబుతున్నారు. రెం డేళ్ల‌కు జమిలి ఎన్నికలు వస్తాయని, అపుడు ఏపీలో జగన్ సర్కార్ కూలి పోతుంద‌ని స‌మాధానం చెబుతున్నారు.

చిలుక జ్యోతిష్యుడిగా మారి జాత‌కాలు చెప్ప‌డం.. ప్ర‌జ‌ల్లో అభాసుపాల‌వ‌డం స‌బ్బం హ‌రికి కొత్తేం కాదు. గ‌తంలోనూ జగన్ ఈ జన్మలో సీఎం కాలేడని ఆయ‌న జోస్యం చెప్పారు. మరి అది తల్లకిందులై జగన్ ముఖ్య‌మంత్రి అయిపోయారు.  మరి ఆ జోస్యం అట్ట‌ర్ ప్లాప్ అయింది కదా అంటే మాత్రం సబ్బం హరి స‌మాధానం దాట వేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్ర‌బాబు మెప్పు పొందేందుకు, ఆయ‌న దృష్టిలో ప‌డేందుకే స‌బ్బం హ‌రి ఇలా చిల‌క జ్యోతిష్యుడి అవ‌తారం ఎత్తార‌ని వైసీపీ శ్రేణులు తేలిగ్గా కొట్టిపారేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version