వావ్‌.. సచిన్‌కు అరుదైన గౌర‌వం

-

ఈరోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా సచిన్‌కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ) అరుదైన గౌరవం అందించింది. ఎస్‌సీజీలోని ఓ గేటుకు సచిన్ పేరును పెట్టింది. ఇదే క్రమంలో సచిన్ కు సన్నిహితుడు, అతడి స్నేహితుడు వెస్టిండీస్ మాజీ సారథి బ్రియన్ లారాను కూడా ఇలాగే గౌరవించింది. తద్వారా ఈ ఇద్దరూ ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, అలన్ఖ డేవిడ్‌సన్ , ఆర్థర్ మోరిస్ సరసన నిలిచారు.

‘భార‌త్ త‌ర్వాత సిడ్నీ నా ఫేవ‌రెట్ గ్రౌండ్. 1991- 92లో ఆస్ట్రేలియాలో నా మొద‌టి ప‌ర్య‌ట‌న‌తో మొద‌లు నాకు అక్క‌డ ఎన్నో గొప్ప జ్ఞాప‌కాలున్నాయి. నాతో పాటు నా మంచి స్నేహితుడు లారా పేరు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గౌర‌వం క‌ల్పించినందుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, ఆస్ట్రేలియా క్రికెట్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. త్వ‌ర‌లోనే సిడ్నీని సంద‌ర్శిస్తాను’ అని సచిన్ తెలిపాడు. స‌చిన్‌కు సిడ్నీలో గొప్ప రికార్డు ఉంది. 157 స‌గ‌టుతో అత‌ను ప‌రుగులు సాధించాడు. లారా కూడా త‌న మొద‌టి టెస్టు సెంచ‌రీ ఈ గ్రౌండ్‌లోనే చేశాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version