భారతదేశాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసే క్రీడాకారులకు ఇలా జరగడం ఏమిటో అని అంతా సిగ్గుపడుతున్నారు. తాజాగా కొద్ది రోజుల నుండి మహిళా రెజ్లర్ లు తమకు లైంగిక వేధింపులు ఉన్నాయంటూ చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితి. దీనితో వీరు అంతా ఇప్పుడు ఈ విషయాన్ని పెద్ద స్థాయిలో నిరసన చేస్తున్నారు. రెజ్లింగ్ పెడరేషన్ అధ్యక్షుడు మరియు ఎంపీ బ్రీజ్ భూషణ్ మహిళా రెజ్లర్ లను లైంగికంగా వ్యాఖ్యలు చేస్తూ వారిని అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతున్నాడట. కానీ ఈ విషయాన్ని ఇప్పటికే కొందరికి చెప్పినా పట్టించుకోలేదని తెలుస్తోంది.