తెలంగాణ స్థానిక, ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలనే వ్యూహంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే హస్తినలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ఇక్కడి వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తున్నది.
ఈ క్రమంలోనే తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ సచిన్ పైలెట్ చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్టు వద్ద అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.అనంతరం సచిన్ పైలెట్ అక్కడి నుంచి నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు బయలుదేరనున్నారని సమాచారం. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, రాబోయే ఎన్నికల గురించి వీరిద్దరి మధ్య చర్చ జరగనుందని తెలుస్తోంది.