సచిన్ ఆ బాల్స్ ఆడలేనని చెప్పాడు…

-

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆట తీరు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎలాంటి బంతిని అయినా సరే సమర్ధవంతంగా ఎదుర్కొనే సత్తా అతని సొంతం. క్రికెట్ లో సచిన్ ఎందరో బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని సత్తా చాటాడు. దాదాపు 25 ఏళ్ళ పాటు క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు సచిన్. అగ్ర జట్లు కూడా అతనిని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కాక నానా ఇబ్బందులు పడేవి.

బ్రెట్ లీ, ఎన్తిని, మెక్ గ్రాత్, వార్న్, చమిందా వాస్, గెలేస్పీ లాంటి బౌలర్లను ఎదుర్కొన్నాడు. అయితే అతను మాత్రం కొన్ని బంతులను ఆడలేడు అని చెప్పాడు సఫారీ దిగ్గజ ఆటగాడు షాన్ పొలాక్. ఓ సందర్భంలో సచిన్‌ నాతో మాట్లాడుతూ ఆసీస్‌ టూర్‌ గురించి చెప్పాడుని… ఆ జట్టు పేసర్లు విసిరిన షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడలేకపోయానని తనతో చెప్పాడని ఈ సౌత్ ఆఫ్రికా మాజీ ఆల్ రౌండర్ వివరించాడు.

అందుకే తెలివిగా అలాంటి వాటిని వికెట్‌ కీపర్‌ తల మీదుగా లేక స్లిప్‌లోకి పంపినట్టు చెప్పాడని గుర్తు చేసుకున్నాడు పొలాక్. మా జట్టు కూడా భారత్‌లో పర్యటించినప్పుడు సచిన్‌ను అవుట్‌ చేయడం కష్టమే అని చాలాసార్లు అనిపించిందని… అతడు ఎప్పుడు పొరపాటు చేసి దొరుకుతాడా.. అని ఎదురుచూడడమే తప్ప మా ప్రణాళికలేమీ పనిచేసేవి కావని పొలాక్ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version