Kubbra Sait: ఆ సీన్ ని నగ్నంగా.. ఏడు సార్లు రీటేక్‌లు తీశారు.. తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చాను : బాలీవుడ్ హాట్ బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

Kubbra Sait:  బాలీవుడ్ లో ‘శాక్రిడ్ గేమ్స్’ పేరిట రూపొందించిన వెబ్ సిరీస్ తెలియని నెటిజన్స్ ఉండ‌రు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సీరిస్ ను రూపొందించారు దర్శకుడు అనురాగ్ కశ్యప్. ఈ వెబ్ సిరీస్ లో సైఫ్ అలీఖాన్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కుబ్రా సైత్ వంటి ప్ర‌ముఖులు న‌టించారు. సినిమాల‌తో స‌మానంగా వెబ్ సిరీస్‌ల‌కు కూడా ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. సిరీస్‌కు విమర్శలతోపాటు ప్రశంసలూ వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో క్రేజీ రెస్పాన్స్ ల‌భించింది. ఇపుడిపుడే తెలుగులో ఈ వెబ్ సిరీస్ ట్రెండ్ మొదలవుతోంది.

ఇదిలా ఉంటే.. వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా అందాల‌ను ఆరాబోసిన న‌టి కుబ్రా సైత్ .. ఆమె తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. కానీ ఆమె మాత్రం కెమెరా ముందు చాలా కష్టపడాల్సి వచ్చిందట. తాజాగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై సన్సెష‌న‌ల్ కామెంట్స్ చేసింది.

ఇటీవ‌ల ఓ జాతీయ మీడియాకు ఆమె ఇచ్చిన ఇంట‌ర్య్వూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా న్యూడ్ సీన్ల చిత్రీక‌ర‌ణ గురించి ఒళ్లు గ‌గ్గుర్లు పుట్టించే నిజాల‌ను వెల్ల‌డించింది. ‘ఈ వెబ్ సిరీస్‌లో నేను కుక్కూ అనే ట్రాన్స్‌జెండ‌ర్‌గా న‌టించా. ఈ సిరీస్‌లో ప‌లు న్యూడ్ సీన్ల‌లో న‌టించాల్సి ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ముందుగానే చెప్పారు.

అయితే న‌గ్నంగా న‌టించిన ప్ర‌తీ సీన్ ను అనేక సార్లు రీ టేక్ చేశారు. ఒక సీన్ బాగా రాలేద‌ని.. ఏడు సార్లు రీ-టేక్‌లు అడిగేవారు. అలా నగ్నంగా రీ టేక్ చేసే సరికి ఏడుపు వ‌చ్చేసేది. వాపోయింది. ఈ క్ర‌మంలో సీన్ అందంగా రావ‌డానికి ఎన్ని సార్లు అయినా రీ టేక్ చేస్తామ‌ని, త‌ప్పుగా భావించ‌వ‌ద్ద‌ని, కానీ వెబ్ సిరీస్ బయటకు వచ్చాక, నన్ను అందంగా తీశారని అంటావని కశ్యప్ చెప్పేవారని కుబ్రా తెలిపింది.

ముంబైలోని గ్యాంగ్‌స్టర్లు, పోలీసులు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లు.. వాళ్ల మధ్య సినిమా నటులు పడిన ఇబ్బందులను తెలుపు విక్రమ్ చంద్ర ఓ బుక్ ఆధారంగా సేక్రెడ్ గేమ్స్ టీవీ సిరీస్ తెరకెక్కించారు క‌శ్య‌ప్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version