వాస్తు: బెడ్ రూమ్ లో ఈ మార్పులు చేస్తే మంచిది..!

-

వాస్తు ప్రకారం ఫాలో అయితే ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. అదే విధంగా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరం చేయడానికి వాస్తు బాగా ఉపయోగ పడుతుంది. ఈ రోజు మనతో పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకోవడం జరిగింది. వీటిని కనుక అనుసరిస్తే తప్పక మంచి జరుగుతుంది.

మన ఇంట్లో కర్టెన్లు వంటివి తలుపులకి కడుతూ ఉంటాము. అటువంటి వాటిపై కూడా జాగ్రత్తగా దృష్టి పెట్టాలని వాస్తు పండితులు చెప్పడం జరిగింది. మన ఇంట్లో ఉండే కర్టెన్ల వల్ల కూడా ఫీలింగ్స్ బాగుంటాయి. అలానే ఆలోచనలు కూడా మారుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కర్టెన్లు కట్టాలి అంటే వాటి రంగు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని వాస్తు పండితులు చెప్పారు.

బెడ్రూంలో కట్టినప్పుడు ఆరెంజ్, పింక్ లేదా నీలం రంగు వాటిని కడితే మంచిది. వీటి వల్ల మంచి వైబ్రేషన్స్ వస్తాయి అదే విధంగా భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, గొడవలు వంటివి రాకుండా ఉండాలంటే కర్టెన్లు ఎంచుకునేటప్పుడు ఈ రంగులు ఉండేటట్లు చూసుకోండి.

వీలైతే మూడు రంగులు కూడా తీసుకుని మీరు తలుపులు కిటికీలుకి కట్టండి. దీనితో చెడు తొలగిపోయి మంచి కలుగుతుంది. అదే విధంగా బెడ్రూంలో కర్ట్నెలు కట్టినప్పుడు ఎరుపురంగు వద్దు. కానీ దక్షిణ దిశలో ఎరుపురంగు వాటిని కడితే మంచిదే. దక్షిణం వైపు ఎరుపురంగు కర్టెన్లు కట్టడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. అదేవిధంగా ప్రేమానురాగాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మార్పులు చేసి చూడండి. దీనితో సమస్యలు తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version