మహారాష్ట్ర రాజాధాని ముంబైలో ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. మధ్య౦ మత్తులో ఒక ప్రబుద్ధుడు జనాలు నిద్రపోయే సమయంలో అంటే అర్ధరాత్రి సమయంలో కాలింగ్ బెల్ కొడుతున్న ఘటన ఇది. సాధారణంగా కొంత మంది మందు ఎక్కువైతే ఎం చేస్తారో వారికే ఒక స్పష్టత ఉండదు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ జనాలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. తాజాగా ఒక వ్యక్తి ఇదే విధంగా ప్రవర్తించాడు.
ముంబై పోలీసులు 37 ఏళ్ళ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జనాలు నిద్రపోతున్న సమయంలో ఒక అపార్ట్మెంట్ కి వెళ్లి డోర్ బెల్ కొట్టి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ముంబైలోని చెంబూర్ ప్రాంత నివాసి అయిన ప్రేమ్ లాల్సింగ్, నేపాల్ నుంచి వచ్చి నివాసం ఉంటున్నాడు. ఈ వ్యక్తిని ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు కంజూర్‌మార్గ్‌లోని
ఒక ఆభరణాల ఇంటి యజమాని డోర్ బెల్ మోగించి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు కాని చుట్టు పక్కల వారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించగా తాను మద్యం మత్తులో ఇలా చేశా అని అంగీకరించాడు. పోలీసుల విచారణలో గతంలో కూడా అతను ఇదే విధంగా ప్రవర్తించాడని గుర్తించారు. 2018 సెప్టెంబర్‌లో కూడా ఫిర్యాదు అతనిపై ఫిర్యాదు చేసారు. చిన్న సమస్య అనుకున్నామని కాని ఇది పెద్ద సమస్య అని పోలీసులు పేర్కొన్నారు.