ఎన్టీఆర్ వర్ధంతి నాడు టీడీపీలో తీవ్ర విషాదం !

-

ఎన్టీఆర్ వర్ధంతి నాడు టీడీపీలో తీవ్ర విషాదం  నెలకొంది. విద్యుత్ షాక్ తో టిడిపి కార్యకర్త మృతి చెందారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం శామంతపూడి గ్రామంలో టిడిపి జెండా ఆవిష్కరిస్తూ విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన దుర్ఘటన ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

‘‘ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ దుర్ఘటన జరగడం కలిచివేసింది. మృతుడు వెంకట నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని, గాయపడిన వారికి అత్యున్నత వైద్యం అందేలా చూడాలని’’ చంద్రబాబు స్థానిక టిడిపి నాయకులను ఆదేశించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ కరెంట్ షాక్ కు గురై కార్యకర్త మద్దినేని వెంకటనారాయణ చనిపోవడం, మరో ఇద్దరు కార్యకర్తలు గాయపడటం బాధాకరం. మద్దినేని వెంకటనారాయణ మృతికి సంతాపం.వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వెంకటనారాయణ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version