బిగ్ బాస్ 4 : ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే ?

-

తెలుగులో బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. కరోనా ప్రభావంతో కొత్త సినిమాలు పెద్దగా లేకపోవడంతో బిగ్ బాస్ షో ప్రేక్షకులను టీవీలకు కట్టపడేస్తోంది. ఇక ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న అంశం బిగ్ బాస్ ప్రేక్షకుల మధ్య ఉత్కంఠను రేపుతోంది. మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.

నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు ఓటింగ్‌కు సంబంధించిన ప్రక్రియ నిన్న రాత్రితో ముగిసింది. ఆరో వారపు నామినేషన్‌ లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు పేర్ల ప్రకారం చూస్తే అభిజిత్, అఖిల్, అరియానా, దివి, హారిక, కుమార్ సాయి, లాస్య, నోయల్, మోనల్‌ లు ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారన్న అంశం ఆసక్తి రేపుతోంది. అయితే ప్రతి వారం లానే ఈ వారం కూడా అందుతున్న లీకులు, సోషల్ మీడియా ప్రచారం మేరకు కుమార్ సాయి ఎలిమినేట్ కాబోతున్నట్టు చెబుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది రేపటి దాకా ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version