కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని యువత మొత్తం మత్తులో మునిగి తేలుతుంటే హీరోయిన్ సాయిపల్లవి మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేస్తూ దర్శనమిచ్చింది. అది చూసిన ఆమె అభిమానులు ఎంతో ఖుష్ అవుతున్నారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీ అంటే పబ్బులు, క్లబ్బులు, మందు పార్టీలు, రేవ్ పార్టీలు, డ్రగ్స్ కల్చర్ అనే స్థాయికి తీసుకొచ్చారు కొందరు సినీ పెద్దలు..
కానీ, నేటితరం హీరోయిన్లలో ఫిదా ఫేమ్ సాయిపల్లవి మాత్రం కాస్త డిఫరెంట్.ఇటీవల ఆమె నటించిన అమరన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఫుల్ జోష్ మీదున్న హైబ్రిడ్ పిల్లా.. వరుసగా సినిమాలను లైన్లో పెట్టింది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేడుకల్లో మద్యానికి, పార్టీలకు దూరంగా ఉండి పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయి బాబా ఆలయంలో ధ్యానం చేస్తూ చాలా ప్రశాంతంగా కనిపించింది. ఈ విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.